ఫిబ్రవరి నెల అంటే అందరికి గుర్తొచ్చేది.. ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14). యస్.. ప్రేమ పక్షుల పెద్ద పండుగ ‘వాలెంటైన్స్ డే(Valentine’s Day)’ రాబోతోంది. ప్రేమలో ఉన్న వారందరూ తమ బంధానికి గుర్తుగా ఆరోజును ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మనుసిచ్చిన వారితో నచ్చిన ప్రదేశానికెళ్లి హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు.
వాస్తవానికి ఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల రోజుగా చెప్పుకుంటున్నప్పటికీ, వారం రోజులు ముందుగానే సందడి మొదలవుతుంది. వాలెంటైన్స్ వీక్(రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వాలెంటైన్స్ డే) పేరిట ఫిబ్రవరి 7వ తేదీ నుంచే ప్రేమ పక్షుల ముచ్చట్లు షురూ అవుతాయి. ఆ ఆనందాన్ని రెట్టింపు చేసే ప్రయత్నాలూ మన దేశంలో జరుగుతున్నాయి. మక్రేపారా ప్లే గ్రౌండ్‌లో ‘కిస్ కాంపిటీషన్’ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రదేశం ఎక్కడనేది స్పష్టత లేదు. వెస్ట్ బెంగాల్‌లో మక్రపార మైదాన్ ఉంది. బహుశా.. అదే కావొచ్చని నెట్టింట ప్రచారం.
ఇటువంటి పోటీలు అనేది ఇన్నాళ్లూ విదేశాల్లో జరిగితే.. మనం చెప్పకునేవారం. ఇకపై ఆ బాధ తప్పినట్లే. మన దేశంలోనూ పాశ్చాత్య సంస్కృతి మెల్లమెల్లగా విస్తరిస్తోంది. కాకపోతే, ఈ పోటీల్లో పాల్గొనేందుకు కొన్ని నియమ నిభందనలు ఉన్నాయి. ముఖ్యమైనది ఒంటరిగా వెళ్లేవారికి ప్రవేశం లేదు. తోడు తీసుకొని వెళ్లాలి. మాకు లవర్ లేరు.. అక్కడ జరిగే లీలలు ఒంటరిగా వెళ్లి చూస్తామన్న కుదరదు. లోపలకి రానివ్వరు.
లిప్ కిస్ కాంపిటీషన్ నియమ నిబంధనలు
- ఒంటరి వ్యక్తులకు ప్రవేశం లేదు.
- మీ తోడును వెంట తీసుకొని వెళ్లాలి.
- 15 ఏళ్ల నుండి 90 ఏళ్ల వరకూ అందరూ ఆహ్వానిహతులే.
వేదిక: మక్రేపారా ప్లే గ్రౌండ్
తేదీ: ఫిబ్రవరి 14 (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకూ)
ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ, ఇన్విటేషన్ పేపర్లు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
You already know who gonna win this "lip kiss competition". 💀
— NITESH (@Nitesh805181) February 4, 2025
(Singles not allowed) 😩💔 pic.twitter.com/QslkQNasfa