నిర్మాతలు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని తెలుగు ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అన్నారు. సినీ కార్మికులు సమ్మె వ్యవహారంలో నిర్మాతల మండలి షరతులపై తాజాగా అనిల్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా న్యాయ మైన డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకూ షూటింగ్ లకు హాజరుకామని స్పష్టం చేశారు. ఏ పరిశ్రమలో లేని పని గంటలు ఇక్కడ ఉంటాయన్నారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి చర్చిస్తామన్నారు. కానీ వారు చర్చలు జరిపే లోపు చాలా కుటుంబాలు ఇండస్ట్రీని వదిలి వెళ్లి పోతాయన్నారు. మా న్యాయ పరమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకూ పోరాడతామని అనిల్ వెల్లడించారు.
నిర్మాతలు కొన్ని షరతులు పెట్టారు, వాటిని మేము వ్యతిరేకిస్తున్నామని అనీల్ తెలపారు. పాత పద్దతిలో ఇచ్చే వేతనాలు మాకొద్దు అని తేల్చిచెప్పారు. అంతేకాదు కొత్త వేతనం, మేము ఆశించేలా ఇస్తేనే షూటింగ్ లకు వెళతామన్నారు. వర్కర్స్ డిమాండ్ న్యాయబద్దమైనదని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఛాంబర్ కూడా దాన్ని గుర్తిస్తుందని ఆశిస్తున్నాము.. లేకుంటే ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.
నిర్మాతల మండలి షరతులపై ఫెడరేషన్ సెక్రటరీ దొర స్పందించారు. ఫిలిం ఛాంబర్ వల్లే అసలు గొడవ వస్తున్నాయని ఆయన ఆరోపించారు. నిర్మాతలు సముఖంగానే ఉన్నా, ఛాంబర్ నుంచి స్పందన లేదన్నారు. నిర్మాతల కోసం షూటింగ్ లకు హాజరుకానున్నాము.. ఈమేరకు కమీటి మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈరోజు 25 సినిమాల వరకు చిత్రీకరణలు ఆగిపోయాయని దొర తెలపారు.
కార్మికులకు 45% ఇంక్రిమెంట్ ఇచ్చిన నిర్మాతలకే వర్క్ చేస్తామని తెలిపారు. వేతనాలను ఫెడరేషన్ కి ఇస్తే, మేము వర్కర్స్ కు ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నామన్నారు. పెరిగిన ధరలు వల్ల కార్మికులు ఇబ్బందుకు పడుతున్నారు. కార్మికులకు భోజనాలు పెడుతున్నామంటూ నిర్మాత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.12 గంటల డ్యూటీ చేసే కార్మికులని ఇలా అనటం మంచి పద్దతికాదు..సమస్య పరిష్కారం చేయాల్సిందే ఛాంబర్.. కానీ ఛాంబరే సమస్యలా తయారైందని అన్నారు.