
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఘోర ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌కి ప్రమాదానికి గురైంది. సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వంశీ తన కాన్వాయ్‌లో విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని చివరి రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి.
ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం సైతం ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే వంశీ మిగిలిన వాహనాలతో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.