
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను పూర్తి పారదర్శకతతో పకడ్బందీగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో డాటా ఎంట్రీ ప్రక్రియపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డేటా ఎంట్రీ ప్రక్రియ తప్పులు లేకుండా చేయించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి కావాలని ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
నారాయణ్ ఖేడ్: తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా క్యాలెండర్ ను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ కు ఖేడ్ ఏరియా హాస్పిటల్ హెల్త్ అసిస్టెంట్ జట్ల భాస్కర్, తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం సభ్యులు బొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.