ఆఫీసర్ల నిర్లక్ష్యం.. ఆగమవుతున్న హరితహారం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీలో హరితహారం కోసం తెచ్చిన విలువైన మొక్కలు ఆఫీసర్ల నిర్లక్ష్యంతో చనిపోతున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు రకరకాల మొక్కలను అధికారులు బయటి నుంచి తెప్పించారు.  వీటిని పట్టణంలోని రైటర్​బస్తీలోని ఓవర్​ హెడ్​ వాటర్​ ట్యాంక్​ ప్రాంతంలోని పార్క్​లో ఉంచారు. కాగా మొక్కల ఆలనా పాలనా పట్టించుకోకపోవడంతో వాడిపోతున్నాయి.

మున్సిపల్​ కమిషనర్​తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఉన్నతాధికారులకు లెక్కలు చూపించేందుకు రూ. లక్షలు వెచ్చించి మొక్కలు కొనుగోలు చేసి తెస్తున్నారే తప్ప వాటి పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మొక్కలను సందరక్షించే  చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ALSO READ : ప్రశ్నించినోళ్లపై కేసులు పెట్టడం ఫస్ట్​ టైం చూస్తున్న