
హైదరాబాద్, వెలుగు: వాల్యూ గోల్డ్ గ్రామీణ ప్రాంతాల నుంచి బంగారం కొనడానికి వాహనాన్ని ప్రారంభించింది. కస్టమర్లు బంగారాన్ని తెచ్చిస్తే అక్కడే దాని నాణ్య తను పరీక్షించి మార్కెట్ విలువ ప్రకారం డబ్బులు ఇస్తారు. కుదువ కూడా పెట్టుకోవచ్చు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు కరీంనగర్, పెద్దపెల్లి, హుజురాబాద్, సిరిసిల్ల, సిద్దపేటలకు తమ వాహనం వెళ్తుందని వాల్యూ గోల్డ్తెలిపింది. స్థానికులు వ్యాన్ వద్దకు వచ్చి లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపింది.