3 కుటుంబాల సంపద విలువ రూ.38 లక్షల కోట్లు

3 కుటుంబాల సంపద విలువ రూ.38 లక్షల కోట్లు
  • మనదేశ జీడీపీలో 10 శాతానికి సమానం

న్యూఢిల్లీ: మనదేశంలోని టాప్​–3 వ్యాపార కుటుంబాలు అంబానీ, బజాజ్,  కుమార్ మంగళం బిర్లా - మొత్తం సంపద 460 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.38 లక్షల కోట్లు) కంటే ఎక్కువని, ఇది సింగపూర్ జీడీపీకి సమానమని తాజాగా వెల్లడయింది. హురున్ ఇండియా మోస్ట్ వాల్యూబుల్ ఫ్యామిలీ బిజినెస్‌ల నివేదిక ప్రకారం, ఈ సంపద విలువ మనదేశం జీడీపీలో 10 శాతానికి సమానం.

అంబానీ కుటుంబ సంపద విలువ రూ. 25.75 లక్షల కోట్లు, బజాజ్ కుటుంబ సంపద రూ. 7.13 లక్షల కోట్లు  బిర్లా కుటుంబ సంపద రూ. 5.39 లక్షల కోట్లు. అయితే 15.45 లక్షల కోట్ల విలువైన అదానీ కుటుంబం అగ్రశ్రేణి వ్యాపార కుటుంబాలలో లేదు.  ఎందుకంటే వీరిని మొదటి తరం కుటుంబాలను జాబితా నుంచి మినహాయించారు.  అదానీ, తరువాత పూణావాలా కుటుంబం రూ. 2.37 లక్షల కోట్ల సంపదతో ఐదోస్థానంలో ఉంది. ఈ నివేదిక సుమారు 200 లిస్టెడ్  అన్‌లిస్టెడ్ కంపెనీలను విశ్లేషించింది.  75 శాతం సంస్థలు పబ్లిక్‌ కంపెనీలు కాగా, మిగతావి స్టాక్​ మార్కెట్లలో లిస్ట్​ కాలేదు.