
హైదరాబాద్, వెలుగు: ఇంజన్ ఆయిల్ మేకర్ వాల్వోలిన్ కమ్మిన్స్ భారతదేశంలో తన 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఇది తమకు పెద్ద మైలురాయి అని ప్రకటించింది. 1998 నుంచి ఇంజన్ల కోసం ఆయిల్స్, గేర్ ఆయిల్స్, రేడియేటర్ కూలెంట్స్, బ్రేక్ ఫ్లూయిడ్స్ అమ్ముతున్నామని తెలిపింది. నాణ్యత గల లూబ్రికెంట్స్, అసాధారణమైన సేవలు అందిస్తున్నామని పేర్కొంది.