ఓదెల‌‌-2లో వంశరాజ్​కులాన్ని కించపరిచిన్రు

ఓదెల‌‌-2లో వంశరాజ్​కులాన్ని కించపరిచిన్రు
  •  ఆ సినిమా నిర్మాత , డైరెక్టర్​పై చర్యలు తీసుకోవాలి
  • నవోదయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ పటేల్ డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: ఓదెల–2 సినిమాలో వంశరాజ్(పిచ్చకుంట్ల) కులాన్ని కించపిరిచేలా డైలాగులు ఉన్నాయని, తక్షణమే ఆ సినిమా నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని నవోదయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ పటేల్, తెలంగాణ రాష్ట్ర వంశరాజ్ సంక్షేమ సంఘం సభ్యుడు మల్లేశ్​డిమాండ్ చేశారు. పిచ్చకుంట్ల కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాత మధు, దర్శకుడు అశోక్ తేజపై ఇటీవల అత్తాపూర్ పోలీస్ స్టేషన్​లో, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తక్షణమే వారిపైన చర్యలు తీసుకుని ఆ సినిమాలో పిచ్చకుంట్ల వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు.