వంశీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తడు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

వంశీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తడు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్​:  అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నిక్కల్లో మరోసారి కాంగ్రెస్ ను ప్రజలు గెలిపిస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హై టెక్ సిటీ లోని తన నివాసంలో ఓటు వేసేందుకు వెళ్లే ముందు   వివేక్ వెంకటస్వామి సరోజ దంపతులు, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కాకా వెంకటస్వామి ఫోటో కు మొక్కారు. అనంతరం వంశీ కృష్ణ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. 

 జిల్లా కేంద్రంలోని కార్మెల్ హైస్కూల్ లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జడ్పీ గర్ల్స్ హై స్కూల్ లో గడ్డం వంశీకృష్ణ,  తల్లి సరోజ ఓటు వేశారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్  మాట్లాడుతూ  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ఈ ఎన్నికలు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటర్లు ఓటు వేశారన్నారు. 

 రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారన్నారు.అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెపుతున్నాయన్నారు.  వంశీ కృష్ణ భారీ మెజారిటీ తో విజయం సాధిస్తాడని  చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ పరధిలోని ఏడు నియోజకవర్గాల్లో  ఓటింగ్​కు మంచి స్పందన వస్తుందన్నారు.  రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్​ రెండో స్థానం కోసం కొట్లాడుతున్నాయన్నారు.