- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి
గోదావరిఖని, వెలుగు : కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కాకా కుటుంబంపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాసేవ కోసం కాకా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
దేశంలో ప్రజలందరూ కలిసి ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. మీటింగ్‌లో లీడర్లు బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్, పాతిపెల్లి ఎల్లయ్య, బొమ్మక రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం : గడ్డం వంశీకృష్ణకే మాదిగ ఉప కులాల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య అన్నారు. మండలంలోని ఒడెడ్ గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గం నాయకులు మాట్ల రవి మాదిగ, పాల సిద్ధార్థ, శ్రీకాంత్ రాకేశ్ మంథని కుమార్, ఎనుముల రమేశ్ పాల్గొన్నారు.
గోదావరిఖని : పారిశ్రామిక వేత్త, విజన్ ఉన్న లీడర్ గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. కాకా వెంకటస్వామి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు వంశీ అని చెప్పారు.
గొల్లపల్లి : గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. గొల్లపల్లి మండలంలోని రంగధాముని పల్లి, తీర్మాలపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడారు. మరోవైపు రాఘవపట్నం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కొలకాని జలంధర్ తో పాటు పలువురు నాయకులు లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.