గోదావరిఖని, వెలుగు : ప్రజలు, కార్మికుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే పెద్దపల్లి ఎంపీగా కాకా మనువడు గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమనిపిస్తోందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్అన్నారు. గురువారం సింగరేణి జీడీకే 1వ గనిపై బాయిబాట, ఏరియా వర్క్‌షాప్‌లో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. అలాగే గోదావరిఖనిలో ఎల్ఐసీ ఏజంట్లు, ఆఫీసర్లతో, పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో రైతులతో సమావేశం, రాత్రి టౌన్‌లోని పవర్‌హౌస్ కాలనీ, పద్మావతి కాలనీ, కేసీఆర్ కాలనీ, మార్కండేయకాలనీలో పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లలో సింగరేణి కార్మికుల కోసం ఏమీ చేయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. గతంలో మంత్రిగా ఉన్న కొప్పుల ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మేయర్ అనిల్‌కుమార్, లీడర్లు కె.సదానందం, బొంతల రాజేశ్, శ్రీనివాస్, స్వామి, లింగస్వామి, గడ్డం కృష్ణ, ఎట్టం కృష్ణ, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. అలాగే వంశీకృష్ణకు ఓటేయాలని కోరుతూ ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్ మూర్మూర్, ఆకెనపల్లి, ఎగ్లాస్పూర్ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి అభ్యర్థించారు.
సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి పార్లమెంట్ సీటును కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్, జూలపల్లి మండలం జూలపల్లి, పెద్దాపూర్, తేలుకుంట, నాగులపల్లి, చీమల పేట గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. లీడర్లు బొజ్జ శ్రీనివాస్, బొద్దుల లక్ష్మణ్, తిరుపతి రెడ్డి, వేణుగోపాల్ రావు, గండు సంజీవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.