పెద్దపల్లి ఎమ్మెల్యేతో వంశీకృష్ణ భేటీ

పెద్దపల్లి ఎమ్మెల్యేతో వంశీకృష్ణ భేటీ

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ సోమవారం భేటీ అయ్యారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆయన మంగళవారం జరగబోయే కౌంటింగ్ ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలతో వంశీకృష్ణ మాట్లాడారు. వంశీకృష్ణ గెలుపు ఖాయమని పేర్కొంటూ ఎమ్మెల్యే విజయరమణారావు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. లీడర్లు రామ్మూర్తి, చిలుక సతీశ్, ప్రేమ్‌‌‌‌‌‌‌‌సాగర్ రెడ్డి, మనోహర్ పాల్గొన్నారు.