కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం: వంశీకృష్ణ

కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం: వంశీకృష్ణ

లింగాల, వెలుగు: కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్  వంశీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వడ్డెరాయవరం, రాయవరం, ధారారం, చెన్నంపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్  6 గ్యారంటీలను వివరించి కాంగ్రెస్​ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. నాగేశ్వరరావు, భాగ్యబాయి, డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్, ఇందిరమ్మ, విజయలక్ష్మి, మల్లయ్య, శ్రీశైలం పాల్గొన్నారు. 

సేవకుడిగా పనిచేస్తా

ధన్వాడ: నారాయణపేట నియోజకవర్గం కాంగ్రెస్  అభ్యర్థి పర్ణికారెడ్డిని గెలిపిస్తే, ఆమెతో పాటు తాను సేవకుడిగా పని చేస్తానని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఓ కన్వెన్షన్  హాల్​లో ధన్వాడ, మరికల్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్ణికారెడ్డిని గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గాజుల శివకుమార్, బాలకృష్ణ, చిట్టెం దామోదర్ రెడ్డి, వీరన్న, బాల్ రెడ్డి, సూర్య ప్రకాశ్, రాఘవేందర్ రెడ్డి, జట్టం లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన నేతలు, ప్రజలు కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

సైనికుల్లా పని చేద్దాం

హన్వాడ: గడప గడపకు ఆరు గ్యారంటీలను వివరించి పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కాంగ్రెస్  పార్టీ అభ్యర్ధి యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు.  బుధవారం మండలంలోని మునిమోక్షంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  ఆయన మాట్లాడారు.  మునిమోక్షం ఉప సర్పంచ్ శ్రీనివాస్​రెడ్డి, మాజీ సర్పంచులు నవనీత, దండు నర్సింలు, రాంరెడ్డి,బాల్ రెడ్డితో మునిమోక్షం, కిష్టంపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. 
 
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

మహబూబ్ నగర్ కలెక్టరేట్: నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజాస్వామ్యం కాంగ్రెస్  పార్టీ ద్వారానే సాధ్యమని మున్సిపల్ కౌన్సిలర్  ఆనంద్ కుమార్ గౌడ్  తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన అనంతరం కాంగ్రెస్​ పార్టీ ఆఫీసులో  పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆరాచకం తట్టుకోలేక, కాంగ్రెస్ పథకాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, జహీర్ అఖ్తర్, లతాశ్రీ, అమరేందర్ రాజు, అనిత, లక్ష్మణ్ యాదవ్, చంద్రశేఖర్, నాగరాజు పాల్గొన్నారు. 
 
గండీడ్: కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్  పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహమ్మదాబాద్, చిన్నాయపల్లి, రాయిగారితండా, బండమీదితండా, మంగంపేటలో ఇంటింటి  ప్రచారం నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేఎం నారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాధారెడ్డి పాల్గొన్నారు.