అన్నవరం కొండపై వ్యాన్ బోల్తా

అన్నవరం కొండపై వ్యాన్ బోల్తా

అన్నవరం కొండపై ఓ వ్యాన్ బోల్తా పడింది. లోవ దర్శనం తర్వాత 22మందితో వెళ్తున్న ఒక వాహనం కొండపైకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొండపై మొదటి మలుపులో డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో వ్యాన్ బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో 10మందికి గాయాలవగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో క్షతగాత్రులను ఆటోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.