NED vs BAN: తప్పుడు DRS.. కెప్టెన్ కొడతాడని పరుగెత్తిన నెదర్లాండ్స్ బౌలర్

NED vs BAN: తప్పుడు DRS.. కెప్టెన్ కొడతాడని పరుగెత్తిన నెదర్లాండ్స్ బౌలర్

వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై నెదర్లాండ్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టు కొట్టింది తక్కువ స్కోరైనా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో బంగ్లాపై చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రపంచంలోనే ఇంతకన్నా చెత్త రివ్యూ మరొకటి ఉండదనే అభిప్రాయం మనకు కలుగుతుంది. 

 230 పరుగుల ఒక మాదిరి లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లాదేశ్ 113 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నెదర్లాండ్స్ విజయం లాంఛనమే అనిపించినా అసలు కామెడీ అంతా ఇక్కడే జరిగింది. క్రీజ్ లో ముస్తాఫిజర్ రెహమాన్, తస్మిన్ అహ్మద్ ఉన్నారు. జట్టు స్కోర్ 121 పరుగుల వద్ద ఆర్యన్ దత్ బౌలింగ్ లో తస్కిన్ అహ్మద్ డిఫెన్స్ ఆడాడు. దీంతో బౌలర్ అప్పీల్ చేయగా.. ఆల్ రౌండర్ వాన్ బీక్ రివ్యూకు వెళ్లాల్సిందిగా కెప్టెన్ ను కోరాడు. 

Also Read :- ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నా

అప్పటికే గెలుపుకు చేరువవ్వడంతో మిగిలిన ఉన్న రివ్యూ తీసుకునేందుకు ఎడ్వార్డ్స్ ఆసక్తి చూపించాడు. అయితే రిప్లైలో మాత్రం బంతి స్పష్టంగా బ్యాట్ కు తగలడంతో గ్రౌండ్ లో నెదర్లాండ్స్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలో అందరూ నవ్వుకున్నారు. ఇది చూసిన వన్ బీక్ కెప్టెన్ కొడతాడని దూరంగా పరిగెత్తడం హైలెట్ గా నిలిచింది. ఇక నెటిజన్స్ అయితే క్రికెట్ చరిత్రలో ఇదే చెత్త రివ్యూ అని ట్వీట్ చేస్తున్నారు.