- వాల్పోస్టర్ ఆవిష్కరణలో పద్మశ్రీ వనజీవి రామయ్య
ఖమ్మం రూరల్, వెలుగు : రెండో అంతర్జాతీయ తెలుగు సభలను విజయవంతం చేయాలని పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య పిలుపునిచ్చారు. ఏపీలోని రాజమండ్రిలో ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో జనవరి 5, 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో మహా సభల వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు భాష ఉన్నతంగా వెలిగేందుకు చర్చలు, కవితా గోస్టులు, నృత్య ప్రదర్శనలు, కళ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కవులు, రచయితలు భారతి శ్రీనివాస్, రేళ్ల శ్రీను, శోభనాద్రి, గుడిసె వంశీ భార్గవ, శ్రీనివాస్ ఉన్నారు.