
ఖమ్మం టౌన్, వెలుగు: పద్మశ్రీ, వనజీవి దరిపల్లి రామయ్య రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. రామయ్య ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామంలోని తన ఇంటి వద్ద నుంచి మరెమ్మ గుడి రోడ్డు వెంట విత్తనాలు ఏరుకుంటూ ఖమ్మం వచ్చారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో తన మనువరాలు మౌనిక డెలివరీ కావడంతో ఆమెను చూసి ఖమ్మం బస్టాండ్ నుంచి మున్సి పల్ కార్పొరేషన్ రోడ్డుపై బైక్ మీద వెళ్తున్నారు. ఈ క్రమంలో మజీద్ వద్దకు రాగానే ఓ గుర్తుతెలియని వాహనం రామయ్య బైక్ కు తగలడంతో ఆయన కింద పడిపోయారు. చాతిలో స్వల్ప గాయాలు అయ్యాయని జిల్లా ప్రధాన హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు.