![వనమా పిటిషన్ కొట్టేసిన హైకోర్ట్.. జలగంకు లైన్ క్లియర్ అయినట్టే.!](https://static.v6velugu.com/uploads/2023/07/Vanama-Venkateshwar-Rao's_G9Y0xHm7Jy.jpg)
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుకు మరోసారి హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకు వెళ్లే వరకు హైకోర్టు తీర్పును నిలిపివేయాలని వనమా వేసిన పిటిషన్ ను కొట్టేసింది.
2018 ఎలక్షన్ లో తప్పుడు వివరాలు సమర్పించారని.. అతడి ఎన్నిక చెల్లదని జులై 25న తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అతడిపై అనర్హత వేటుతో పాటు 5లక్షల జరిమానా విధించింది. 2018 డిసెంబర్ 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్ రావు అని ప్రకటిచింది. అయితే సుప్రీం కోర్టుకు వెళ్లేంత వరకు హైకోర్టు తీర్పును నిలిపివేయాలని జులై 26న వనమా వెంకటేశ్వర్ రావు మరోసారి పిటిషన్ వేశారు. ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ వనమా పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో జలగం వెంకట్ రావుకు లైన్ క్లియర్ అయినట్లే.