కొత్తగూడెం అభివృద్ధి బీఆర్​ఎస్​తోనే సాధ్యం : వనమా వెంకటేశ్వరరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి బీఆర్​ఎస్​తోనే సాధ్యమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం పాల్వంచ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రూ. 3వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కొత్తగూడెం–పాల్వంచ పట్టణాలను జంటనగరాలుగా తీర్చి దిద్దుతామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ సీనియర్​ నేతలు ఎడవల్లి కృష్ణ, కోనేరు సత్యనారాయణ పాల్గొన్నారు. 

మున్నూరు కాపుల అత్మీయ సమ్మేళనంలో వద్దిరాజు

పాల్వంచలోని బాబూజీ నగర్​లో మున్నూరు కాపుల అత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బీఆర్​ఎస్​ నియోజకవర్గ ఇన్​చార్జ్​ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందాలంటే వనమా వెంకటేశ్వరరావును మళ్లీ గెలిపించాలని కోరారు. నియోజకవర్గ మున్నూరు కాపులంతా వనమాకు అండగా ఉండాలన్నారు.  

ALSO READ : ఎన్నికల విధుల్లో అలసత్వాన్ని సహించేదిలేదు : వి.పి గౌతమ్