జూలై14న యాదగిరిగుట్టలో వనమహోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 14న వనమహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాదగిరికొండ చుట్టూ రెండున్నర కిలో మీటర్ల మేర ఉన్న గిరిప్రదక్షిణ మార్గంలో దాదాపుగా 2 వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఈనెల 15న స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున మొదలయ్యే ఈ గిరిప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.