
వనపర్తి టౌన్/నారాయణపేట, వెలుగు: రాష్ట్ర స్థాయి గ్రీన్ ఛాంపియన్ అవార్డుకు వనపర్తి గవర్నమెంట్ కో ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజీ ఎంపికైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందజేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్ శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. అలాగే నారాయణపేట మున్సిపాలిటీ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గ్రీన్ ఛాంపియన్ అవార్డుకు ఎంపికైంది. మున్సిపల్ కమిషనర్ సునీత, ఇంజనీర్ మహేశ్ అవార్డును అందుకున్నారు.