మదనాపురం, వెలుగు : వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోవిందహళ్లి గ్రామానికి చెందిన దాసరి తిరుపతయ్య(39) గొంతులో గుడ్డు ఇరుక్కొని చనిపోయాడు. తిరుపతయ్య బుధవారం రాత్రి ఇంటి దగ్గర ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో ఇరుక్కొని శ్వాస ఆడక తీవ్ర ఇబ్బందిపడ్డాడు.
వెంటనే భార్య, కుటుంబసభ్యులు కొత్తకోట దవాఖానకు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. తిరుపతయ్యకు భార్య సువర్ణ, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. తిరుపతయ్య చేపల వేటతో పాటు హమాలి పని చేసేవాడు.