వనపర్తి నుంచి నేనే పోటీ చేస్తా: శివసేనా రెడ్డి

వనపర్తి నుంచి నేనే పోటీ చేస్తా: శివసేనా రెడ్డి

వనపర్తి, వెలుగు:  గతంలో యూత్ కాంగ్రెస్ కోటా లో టికెట్ పొందిన మాజీ మంత్రి చిన్నారెడ్డి మాదిరిగానే తనకు ఈ సారి అదే కోటాలో వనపర్తి కాంగ్రెస్  టికెట్ వస్తుందని  యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అన్నారు.  మంత్రి నిరంజన్ రెడ్డిపై ఘన విజయం  సాధిస్తానని ఆయన దీమా వ్యక్తం చేశారు. గురువారం వనపర్తిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే  ఎన్నిక్లలో కాంగ్రెస్  తరపున  తాను వనపర్తి నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నానని ఆయన వెల్లడించారు.  

ఈ ప్రాంత వాసిగా తాను వనపర్తి టికెట్ ను ఆశిస్తున్నానని, ఇందుకు మాజీ మంత్రి చిన్నారెడ్డి సహకరించాలని శివసేనా రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత 30 ఏళ్లుగా  ఎన్నికల బరిలో ఉన్న చిన్నారెడ్డి ఆయన కోసం పనిచేసిన  తన తండ్రి పుల్లారెడ్డి సేవలు గుర్తించి అయినా తనకు అవకాశం కల్పించాలని  కోరారు.  వనపర్తిలో తనకు అవకాశం ఇస్తే యువతతో పాటు పార్టీ సీనియర్లు అంతా సంపూర్ణ మద్దతు ఇస్తారని చెప్పారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 21న వనపర్తి కలెక్టరేట్ ముట్టడిస్తామని, 23న హైద్రాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయం దిగ్బందం చేయనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో  శంకర్ ప్రసాద్,  శ్రీనివాస్ గౌడ్, చంద్రమౌళి, విష్ణు, యూత్  నాయకులు పాల్గొన్నారు.