మదనాపురం, వెలుగు : ఫిర్యాదులు తీసుకోవడంలో స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యం చేయొద్దని వనపర్తి ఎస్పీ రక్షితకే మూర్తి తెలిపారు. మంగళవారం మదనాపురం పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... పోలీసులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది సాయి రెడ్డిఖాజా, రాములు, పాల్గొన్నారు.