వనపర్తి, వెలుగు : వనపర్తి నుంచి పై చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు అక్కడ అనుమానాస్పదంగా చనిపోయాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని13వ వార్డుకు చెందిన గట్టు ఎంకన్న ఒక్కగానొక్క కొడుకు దినేశ్(23) బీటెక్ పూర్తి చేశాడు. గత ఏడాది డిసెంబర్ 28న ఎంఎస్చేయడానికి యూఎస్వెళ్లాడు. అక్కడే ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసి తన రూమ్‌లో పడుకున్న దినేశ్ఉదయం లేవలేదు.
స్నేహితులు లేపడానికి ప్రయత్నించినా లేవలేదు. దీంతో చనిపోయాడని అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తమ కొడుకు అకస్మాత్తుగా చనిపోవడం ఏమిటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్పాయిజన్వల్లే చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. డెడ్‌బాడీని త్వరగా తెప్పించేందుకు కృషి చేస్తానని, విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.