జనంపైకి దూసుకొచ్చిన కారు.. 11మంది మృతి

జనంపైకి దూసుకొచ్చిన కారు..  11మంది మృతి
  • కెనడాలోని వాంకోవర్ సిటీలో ప్రమాదం

న్యూఢిల్లీ: కెనడాలోని వాంకోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో పాల్గొన్న జనంపైకి కారు దూసుకురావడంతో 11 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది ఫిలిప్పినో -కెనడా జాతీయులు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 41 అవెన్యూ, ఫ్రెజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాపులాపు డే బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతోంది. ఆ సమయంలోనే ఇందులో పాల్గొన్న వారిపైకి ఓ వాహనం దూసుకొచ్చింది. 

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక పోలీసులు సోషల్ మీడియాలో తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే వారు స్పాట్ కు చేరుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రమాదమా.. టెర్రరిస్టుల దాడా అనే కోణంలోను  దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని మార్క్ కార్నీ విచారం వ్యక్తం చేశారు. వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ మృతులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.