సత్తుపల్లి, వెలుగు : ఆర్యవైశ్య సంఘం సత్తుపల్లి మండల అధ్యక్షుడిగా వందనపు సత్యనారాయణ ఎన్నికయ్యారు. కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
సత్తుపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా వెంకటేశ్వర ఇండియన్ గ్యాస్ డీలర్ వందనపు సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది సోమిషెట్టి శ్రీధర్, మండల యువజన అధ్యక్షుడిగా చిట్లూరి నారాయణ గుప్త, పట్టణ యువజన అధ్యక్షుడిగా చవ్వా సన్ని, వాసవి క్లబ్ సత్తుపల్లి గ్రేటర్ అధ్యక్షుడిగా పసుమర్తి గోపాలరావు ను ఎన్నుకున్నారు.
నూతన బాధ్యులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రఘమయి దయానంద్ తో పాటు ఆర్యవైశ్య సంఘ పెద్దలు కొత్తూరు ప్రభాకర్ రావు, గుడిమెట్ల గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసుదేవరావు, గంగిశెట్టి జగదీశ్కుమార్, మొరిసెట్టి సాంబశివరావు అభినందించారు. ఈ సందర్భంగా తులసి చెట్టు వద్ద కార్తీక పూజలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గుండు ఉమ, నడిపల్లి లక్ష్మీనారాయణ, రతికంటి సత్యం బాబు, దారా కృష్ణారావు, ఏపూరి పోరుషోత్తం, చిత్తలూరి సాయిరాం పాల్గొన్నారు.