వేగం పెంచిన వందే భారత్‌‌ ఎక్స్​ప్రెస్

వేగం పెంచిన వందే భారత్‌‌  ఎక్స్​ప్రెస్

సికింద్రాబాద్​, వెలుగు: కాచిగూడ-– యశ్వంతపూర్ మార్గంలో  ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్​ప్రెస్ స్పీడ్‌‌ను రైల్వే అధికారులు మరింత పెంచారు.  దీంతో రైలు వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.  ఇంతకుముందు 8.30 గంటల  ప్రయాణ సమయం తీసుకున్న  రైలు 15  నిమిషాల మేర వేగాన్ని పెంచారు.  దీంతో  రెండు రూట్లలో ప్రయాణం ఇప్పుడు 8 గంటల 15 నిమిషాల వ్యవధిలో గమ్య స్థానం చేరుకోనుంది.  ఇప్పటి వరకు  కాచిగూడ నుంచి 5.30 గంటలకు బయలు దేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్‌‌‌‌ చేరుకునే ఈ రైలు ఇక నుంచి 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్​పూర్​ చేరుకుంటుంది.