వందే భారత్ స్లీపర్ రైళ్లు..విమానం లెక్క ఉంది కదా..

వందే భారత్ స్లీపర్ రైళ్లు..విమానం లెక్క ఉంది కదా..

దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యమైన పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ..ప్రజలను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఈ రైళ్లకు క్రేజ్ పెరగడంతో రైల్వే శాఖ వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 33 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే వందే భారత్ రైళ్లలో  ప్రధాన లోపం స్లీపర్ కోచ్లు లేకపోవడం. అయితే ఈ లోపాన్ని సరిచేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వందే భారత్ రైళ్లలో  స్లీపర్ కోచ్‌లు ప్రవేశపెట్టనుంది.  ఇందులో భాగంగా స్లీపర్ కోచ్ వందే భారత్ రైళ్లు ఎలా ఉంటాయో డిజైన్ విడుదల చేసింది.

వందే భారత్ స్లీపర్ రైలు డిజైన్ ఇదే..

వందే భారత్ స్లీపర్ రైలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఈ రైలును రష్యాకు చెందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL), TMH అభివృద్ధి చేస్తున్నాయి. 

ALSO READ : బిగ్ బాస్ కోసం రతికకు భారీ రెమ్యునరేషన్

ఇది రైలా..లేక ఇంద్ర భవనమా..?

వందేభారత్ స్లీపర్ రైలు నిజంగా ఇంద్ర భవనాన్ని పోలి ఉండనుంది. ఫోటోలను బట్టి చూస్తే  ప్రయాణీకులకు ఇది మెరుగైన సౌకర్యాలను అందించబోతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.  విలాసవంతమైన సౌకర్యాలతో వందే భారత్ రైలు ఉండబోతుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లో  మంచి లైటింగ్ ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తోంది. ప్రయాణికులకు ఆటోమేటిక్ డోర్లు ఉండనున్నాయి. ఇది కాకుండా వై-ఫై, సిసిటివి కెమెరాలు, ఎల్‌ఇడి స్క్రీన్ ఇందులో చూడవచ్చు. 

2024 ఫిబ్రవరి నాటికి వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది.  ప్రస్తుతం ఇవి  చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మాణంలో ఉన్నాయి. ఈ రైళ్లలో మొత్తం 857 బెర్త్‌లు ఉంటే ..అందులో 823 బెర్త్‌లను ప్రయాణీకుల కోసం కేటాయిస్తున్నారు. మిగిలినవి విధి నిర్వహణలో ఉండే రైల్వే ఉద్యోగులు, సిబ్బందికి కేటాయిస్తారు. ఒక్కో కోచ్ లో నాలుగు కాకుండా మూడు టాయ్‌లెట్లు ఉంటాయి. ఒక మినీ ప్యాంట్రీలా ఉంటుంది. వందేభారత్ స్లీపర్ కోచ్‌లలో దివ్యాంగులకు అనువుగా ఉండేందుకు ర్యాంప్ అందుబాటులో తీసుకురానుంది.