VandeBharatExpress: సినీ చరిత్రలోనే తొలిసారి.. షూటింగ్ కోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) వచ్చినప్పటి నుంచి ఎంత దూరం ఐనా దగ్గరైంది. ఎక్కువ దూరాన్ని తక్కువ రోజుల్లో ప్రయణించే ఈ వందే భారత్ రైలును ఉపయోగిస్తూ ఓ దర్శకుడు సినిమా తీస్తున్నాడు. అతనే అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ చిత్రనిర్మాత దర్శకుడు షూజిత్ సిర్కార్ (Shoojit Sircar).

మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న దర్శకుడు షూజిత్ సర్కార్ తన కొత్త ప్రాజెక్టులో వందే భారత్ రైలును చూపించనున్నాడు. అయితే, సినీ చరిత్రలోనే తొలిసారి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఉపయోగించిన మొదటి దర్శకుడు ఇతడే అవ్వడం విశేషం. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ మూవీ షూటింగ్ ముంబై సెంట్రల్ స్టేషన్‌లో బుధవారం (డిసెంబర్ 8న) షూటింగ్ జరిగింది. ముంబై సెంట్రల్ స్టేషన్‌లోని ఐదవ నంబర్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. సినిమా షూట్ ద్వారా రైల్వేకు దాదాపు రూ. 23 లక్షలు నాస్ ఫేర్ బాక్స్ రాబడి వచ్చిందని, ఒక రోజు ముందు ముంబై, అహ్మదాబాద్ మధ్య సెమీ హై స్పీడ్ రైలు తన సింగిల్ జర్నీలో రూ.20 లక్షల కన్నాఎక్కువ సంపా దించిందని WR (వెస్ట్రన్ రైల్వే) అధికారులు తెలిపారు.

అయితే, ఇప్పటికే రైలు నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు కూడా చాలానే వచ్చాయి. అందులో కొన్ని సినిమాలైతే మొత్తానికి మొత్తం రైలులోనే ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. అందులో చెప్పుకోదగినవి రైల్వేమెన్, గ్యాస్‌లైట్, హీరోపంతి 2, బ్రీత్ ఇన్‌టు షాడోస్, OMG 2, బేబీ డాల్ మరియు ఏక్ విలన్ రిటర్న్స్ వంటి సినిమాలు ఇటీవలి కాలంలో వెస్ట్రన్ రైల్వేస్ ఆధ్వర్యంలో తీసిన సినిమాలుగా నిలిచాయి.

డైరెక్టర్ షూజిత్ సిర్కార్ విషయానికి వస్తే.. 

బాలీవుడ్ లో నిర్మాత, దర్శకుడుగా మంచి గుర్తింపు పొందాడు. అతను మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నాడు. అలాగే  రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు ఐదు నామినేషన్లతో సహా అనేక అవార్డులను అందుకున్నాడు. సిర్కార్ రొమాంటిక్ వార్ డ్రామా యహాన్‌తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.