
ప్రధానిగా మోదీ మూడోసారి ఆదివారం (జూన్ 9) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.. ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ, విదేశాలనుంచి ప్రముఖులను అహ్వానించారు. ఆహ్వానం జాబితాలో మోదీ నైబర్ హుడ్ ఫస్ట్ విధానాన్ని హైలైట్ చేసింది. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, సీషెల్స్ ,మారిషస్ దేశాల అధ్యక్షులతో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. వీరితోపాటు వందే భారత్, మెట్రో రైళ్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సహా విక్షిత్ భారత్ అంబాసిడర్లు కూడా హాజరుకానున్నారు. ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో పనిచేస్తున్న దక్షిణ రైల్వేలోని చె న్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఐశ్వర్య ఎస్ మీనన్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందింది.. లేడీ లోకో ఫైలట్ గా ఆమె సాధించిన ఘనతకు గాను ఈ అరుదైన అవకాశం లభించింది. ఐశ్వర్య ఎస్ మీనన్ గురించి తెలుసుకుందాం.
విక్షిత్ భారత్ అంబాసిడర్లుగా ఆహ్వానించబడిన కేంద్ర పథకాల లబ్ధిదారులతో పాటు వందే భారత్, మెట్రో రైళ్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులలో ఐశ్వర్య కూడా ఉన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, జన్ శతాబ్ది వంటి ప్రతిష్టాత్మక రైళ్లను పైలట్ చేస్తూ 2 లక్షలకు పైగా ఫుట్‌ప్లేట్ గంటలను పూర్తి చేసిన ఐశ్వర్య గొప్ప ఘనతను సాధించింది.
ఆమె చురుకుదనం, చురుకుదనం, రైల్వే సిగ్నలింగ్‌పై సమగ్ర పరిజ్ఞానం కోసం సీనియర్ అధికారుల నుండి ప్రశంసలు అందుకుంది. ఆమె చెన్నై-విజయవాడ , చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రవేశపెట్టినప్పటి నుండి ఐశ్చర్య పనిచేస్తోంది.
విక్షిత్ భారత్ అంబాసిడర్లుగా కేంద్ర పథకాల లబ్ధిదారులతో పాటు వందే భారత్, మెట్రో రైళ్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులలో ఐశ్వర్య కూడా ఉన్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో పనిచేసిన పారిశుధ్య కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, కార్మికులకు ప్రత్యేక ఆహ్వానం అందించారు.