రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే వందేభారత్ స్లీపర్ ట్రైన్ ను లాంచ్ చేయనుంది రైల్వే శాఖ. అత్యాధునిక టెక్నాలజీతో రెట్టింపు వేగంతో దూర ప్రయాణాలను సౌకర్యవంతం చేసేలా డిజైన్ చేసిన వందేభారత్ స్లీపర్ ట్రైన్ ని 2025 జనవరిలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది రైల్వే శాఖ.
ప్రస్తుతం చైర్ కార్ సర్వీస్ కే పరిమితమైన వందేభారత్ సర్వీస్ స్లీపర్ సెగ్మెంట్ కి త్వరలోనే విస్తరించనుంది. బీఈఎంఎల్ ( BEML ), రైల్ కోచ్ ఫ్యాక్టరీ ( RCF ) సంయుక్తంగా వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్నాయి.
వందే భారత్ స్లీపర్ ట్రైన్ రూట్స్, ట్రావెల్ టైం:
వందే భారత్ స్లీపర్ ట్రైన్ తొలుత న్యూఢిల్లీ, శ్రీనగర్‌లను మధ్య నడుస్తుంది, దీని ద్వారా దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ మరియు కాశ్మీర్ మధ్య అనుసంధానం చేయటం ఒక మైల్ స్టోన్ అని చెప్పచ్చు.
ఈ రైలు సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.. ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గుతుంది, 800 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 13 గంటల్లో పూర్తి చేస్తుంది వందే భారత్ స్లీపర్ ట్రైన్. భవిష్యత్తులో ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చెన్నై వంటి రూట్స్ కి కూడా ఈ సర్వీస్ ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది రైల్వే శాఖ.
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఫీచర్లు ఇవే:
వందే భారత్ స్లీపర్ ట్రైన్ రీజనరేటివ్ బ్రేకింగ్ రీసైకిల్ ఎనర్జీతో వస్తుంది, ఇది ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది, రైలు యొక్క కార్బన్ ఫుట్ ప్రింట్స్ ను కూడా తగ్గిస్తుంది.
ఈ ట్రైన్ లో ఉన్న అండర్ స్లంగ్ ప్రొపల్షన్ ద్వారా నిశ్శబ్దమైన, తేలికైన ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయచ్చు. స్పీడ్, డిస్టెన్స్, ట్రాక్ కండిషన్స్ ను మానిటర్ చేసి ట్రైన్ సేఫ్టీని పెంచేందుకు ద్వారా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టం ను ఉపయోగిస్తున్నారు.
సీటింగ్ సిస్టం ఇలా ఉంటుంది:
కొత్త వందే భారత్ స్లీపర్ ట్రైన్లో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్ కింద మూడు క్యాటగిరీలు ఉంటాయి. ఒక్కో రైలుకు 16 క్యారేజీలతో, 11 ఏసీ 3-టైర్, నాలుగు ఏసీ 2-టైర్ మరియు ఒక ఫస్ట్-క్లాస్ కోచ్‌తో సహా మొత్తం 1,128 మంది ప్రయాణికుల టోటల్ కెపాసిటీని కలిగి ఉంటుంది.
టికెట్ ధర ఏంటంటే:
అఫీషియల్ గా టిక్కెట్ రేట్లు ఇంకా ప్రకటించన్నప్పటికీ.. టికెట్ రేట్లు రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి ఇతర ప్రీమియం రైళ్లలోలాగా ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏసీ 3-టైర్: సుమారు రూ. 2 వేలు
ఏసీ 2-టైర్: దాదాపు రూ. 2వేల 500.
ఏసీ ఫస్ట్ క్లాస్: సుమారు రూ. 3వేలుగా ఉండచ్చని అంచనా వేస్తున్నారు.