
==================================================================
Vande Bharat train from Delhi to Ayodhya semi high speed train only 8 hours journey
Vande Bharat, Delhi to Ayodhya train, New Vande Bharat, Indian Railways, Vandebharat train, 8 hours journey, Delhi -- lucknow- Ayodhaya, latest news, railway news, telugu news, india news
దేశంలోని ప్రజలు సెమీ హై స్పీడ్‌ను చాలా ఇష్టపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి దేశం త్వరలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతుంది. వందేభారత్ లో ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి చేరుకుంటుంది. ఎక్కువమంది ఈ రైలులో ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నాకు. దీనికారణంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ సంఖ్యను నిరంతరం పెంచుతోంది.
ఆనంద్ విహార్ (ఢిల్లీ) , లక్నో , అయోధ్య మధ్య నడిచే మరో వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు జరుపుతుంది. గోరఖ్‌పూర్ .. లక్నో మధ్య నడిచే ట్రైన్ ను ప్రయాగ్‌రాజ్ వరకు విస్తరించాలని రైల్వేశాఖ యోచిస్తోంది. రైలు కోచ్ ఫ్యాక్టరీ నుండి ఉత్తర రైల్వేకి 16 బోగీలు కేటాయించబడ్డాయివందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆనంద్ విహార్ నుండి లక్నోకు ఎనిమిది గంటల్లో చేరుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ట్రైన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా ప్రకటించలేదు.
ఆనంద్ విహార్.. అయోధ్య నడిచే వందేభారత్ ట్రైన్ 160 కిలో మీటర్ల వేగంతో దేశంలో మొదటి స్వదేశీ సెమీ-హై-స్పీడ్ రైలు. దీనిలో GPS ఆధారంగా ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ Wi-Fi , ఆడియో - విజువల్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లాలనుకునే వారికి ఈ రైలు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
UP ప్రభుత్వం కూడా అయోధ్యలో పర్యాటక ఫెసిలిటేషన్ సెంటర్‌ను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికపై పని చేస్తోంది. 4.40 ఎకరాల విస్తీర్ణంలో రూ.130 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని అంచనా. ఈ కేంద్రాలు ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో అభివృద్ధి చేయబడతాయి, జాతీయ రహదారి 330 మరియు జాతీయ రహదారి 27తో కనెక్టివిటీని నిర్ధారిస్తుంది.