గోదావరిఖని, వెలుగు: వందేభారత్ట్రైన్సేవలు ఈ నెల16 నుంచి రామగుండం ప్రాంత ప్రయాణికులకు అందనున్నాయి. నాగ్‌పూర్‌లో ఉదయం ఐదు గంటలకు బయలు దేరే ఈ ట్రైన్ సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లర్షా తర్వాత రామగుండంకు ఉదయం 9.08 గంటలకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 12.15కు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ట్రైన్ రామగుండంకు మధ్యాహ్నం 3.30 గంటలకు, చివరి స్టేషన్నాగ్పూర్కు రాత్రి 8.20 గంటలకు చేరుతుంది. ఈ వందేభారత్ ట్రైన్ మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు నడుస్తుంది.
నాగ్‌పూర్ నుంచి రామగుండంకు నాలుగు గంటలు, రామగుండం నుంచి సికింద్రాబాద్‌కు రెండు గంటల 13 నిమిషాలలో చేరుకోవచ్చని, ఈ సౌకర్యాన్ని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని రైల్వే డీఆర్యూసీసీసీ మాజీ మెంబర్ క్యాతం వెంకటరమణ కోరారు.