Vande Bharat express : మోడీ ప్రారంభించబోయే ట్రైన్ పై రాళ్ల దాడి

విశాఖపట్నం : కంచెరపాలెంలో వందే భారత్ ట్రైన్ పై రాళ్ల దాడి జరిగింది. రెండు కోచ్ ల అద్దాలను దుండగులు ధ్వంసం చేశారు. రామ్మూర్తి పంతులు పేట గేట్ దగ్గర అగంతకులు రాళ్లతో దాడి చేశారు. ట్రయిల్ రన్ లో భాగంగా వెర్షన్ 2 వందే భారత్ రైలు చెన్నై నుంచి విశాఖకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 19వ తేదీన సికింద్రాబాద్ లో ప్రారంభించాల్సిన రైలు ఇదే.

నిర్వహణ పర్యవేక్షణ కోసం వందే భారత్ రైలును విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే కంచెరపాలెంలో ట్రైన్ పై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రైలుపై రాళ్లు విసిరిన ఆకతాయిల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.