కాషాయ రంగులో వందేభారత్​ ట్రైన్స్.. లుక్కు అద్దిరిపోయిందిగా

కాషాయ రంగులో వందేభారత్​ ట్రైన్స్..  లుక్కు అద్దిరిపోయిందిగా

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రారంభించిన వందే భారత్​ రైళ్లు ఇకపై కాషాయ రంగులో దర్శనమివ్వనున్నాయి. అయితే ఇవి చెన్నైలోని ఇంటిగ్రల్​కోచ్​ ఫ్యాక్టరీలో ఉన్నాయి.  కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైశ్ణవ్​ ఆ ప్రాంతాన్ని జులై 8న సందర్శించారు. వందేభారత్​రైళ్లలో మెరుగపరచాల్సిన సౌకర్యాల గురించి అధికారులతో చర్చించారు.  'ఇది మేకిన్​ ఇండియా కాన్సెప్ట్​తో చేస్తున్నది. ప్రయాణికులు ఇచ్చే విలువైన సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని కొత్త వాటిలో మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తాం' అని ఆయన అన్నారు. ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న జీ20 సమావేశాల లోగోలోని కాషాయ రంగులో ట్రైన్లు వస్తున్నాయి. 

ఇప్పటివరకు అవి తెలుపు, నీలం రంగులో ఉండేవి. అయితే తెలుపు రంగులో ఉన్న రైళ్లను శుభ్రం చేసేప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయని అందుకే కలర్​లు మారుస్తున్నామని.. అద్దాలు కూడా నలుపు రంగులోకి మారుస్తున్నట్లు అధికారులు చెప్పారు. వందే భారత్‌ రైళ్ల రంగు విషయంలో.. తాము జాతీయ జెండాను స్ఫూర్తిగా తీసుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చెప్పారు. తన ట్విటర్​ అకౌంట్​లో  రంగులు మారిన రైలు ఫొటోలను ఉంచారు. ఇప్పటివరకు 25కుపైగా మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు.