వందే భారత్ రైళ్ల తరహాలో వందే మెట్రో తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఈ వందే మెట్రో రైళ్లు 100 నుంచి 350 కిలోమీటర్ల పరిధిలో తిరుగుతాయి. సింపుల్ గా చెప్పాంటే ఇంటర్ సిటీ రైళ్లు అన్నమాట.. ఈ రైళ్లను వందే భారత్ తరహాలో అధునాతనంగా తీర్చిదిద్దారు.
వందే మెట్రో మొదలి రైలు ప్రారంభం సమయంలో.. రైల్వే శాఖ అనూహ్య నిర్ణయం తీసుకున్నది. పేరు మార్చింది. వందే మెట్రో కాస్తా ఇప్పుడు.. నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా నామకరణం చేసింది. నమో భారత్ విజనరీలో భాగంగా వీటిని తీసుకొస్తున్నామని.. అందుకే పేరు మార్చినట్లు సమర్థించుకున్నది రైల్వే శాఖ. నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా పేరు మార్పు శుభసూచికం అని కూడా వెల్లడించింది.
ALSO READ | నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్కువందే భారత్
నమో భారత్ ర్యాపిడ్ రైల్ ప్రత్యేకతలు :
>>> మొత్తం 12 కోచ్ లు ఉంటాయి.. 1150 మంది ప్రయాణికులకు సీటింగ్.
>>> ప్రతి బోగీలో రెండు టాయిలెట్స్.. ఒకటి వెస్ట్రన్.. ఒకటి ఇండియన్ స్టయిల్
>>> 4 నుంచి 6 గంటలలోపు జర్నీ కోసం ఈ రైళ్లు తీసుకొచ్చారు.
>>> వందే భారత్ రైళ్లలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
>>> ఇంటర్ సిటీ రైళ్లల్లో ఉన్నట్లే సీటింగ్ ఉంది.. కాకపోతే మంచి సౌకర్యవంతంగా ఉన్నాయి.