ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అటవీశాఖ, పంచాయితీరాజ్ శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహించిన పవన్ ఎర్రచందనం స్మగ్లింగ్ ను కట్టడి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆరోపణలపై స్పందించిన వంగా గీత పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు.
కేంద్రం, రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా.. ఏ విచారణ అయినా చేసుకోండంటూ పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు వంగా గీత.పదేపదే వ్యక్తులను ఇబ్బంది పెట్టేకన్నా, విచారణ చేసి నిజాలు తేల్చాలని అన్నారు. నేరం రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు వంగా గీత. రాష్ట్రంలో టీడీపీ కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు గీత.హైకోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా పార్టీ ఆఫీసు భవనాలు కూల్చివేయటం అన్యాయమని అన్నారు.