ఏపీలో ఇవాళ ( మే 13) సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ జనసేన నుంచి పవన్ కల్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఓ పోలింగ్ కేంద్రానికి వైసీపీ అభ్యర్థి వంగా గీత పరిశీలనకు వచ్చారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఎర్ర కండువా వేసుకుని రావడంతో వంగా గీత అభ్యంతరం తెలిపారు. అతడు జనసేనకు మద్దతుగా ఎర్రకండువా వేసుకుని వచ్చాడని ఆమె అభ్యంతరం చెప్పారు. పిఠాపురం అసెంబ్లీ స్థానంలో టీడీపీ కూటమి నుంచి పవన్ కల్యాణ్ ... వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు.
అయితే ఎండ ఎక్కువుగా ఉండటంతో చెమట ఉక్కపోతను తుడుచుకొనేందుకు గుడ్డను తెచ్చుకున్నానని ఆ వ్యక్తి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వంగా గీత అభ్యంతరం చెప్పడంతో అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలింగ్ సిబ్బంది, పోలీసులు సూచించారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగంట్వీట్ చేసింది.
అధికార అహంకారం తగ్గించుకోవాలి వంగా గీత గారూ. ఎర్ర కండువా మా పార్టీ గుర్తు కాదు, అది సామాన్య శ్రామికులు చెమట తుడుచుకునే కండువా... దాన్ని చూసి ఎందుకు అంత భయపడుతున్నారు? ఎరుపు రంగు కండువా చూస్తేనే ఇంత భయం దేనికి? అంతలా కండువా భయపెడుతుందా @YSRCParty వారిని? @ECISVEEP , @CEOAndhra… pic.twitter.com/9Vb1iMiygy
— JanaSena Shatagni (@JSPShatagniTeam) May 13, 2024