సెప్టెంబర్లో వంగవీటి రాధకృష్ణ పెళ్లి...ఆగస్టు 19న ఎంగేజ్మెంట్

ఏపీ పాలిటిక్స్ లో కీలకనేతగా ఉన్న వంగవీటి రాధకృష్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నర్సాపూర్ కు చెందిన యువతితో ఆయన వివాహం నిశ్చయమైందని సమాచారం .  తన మిత్రుడికి దగ్గర బంధువులైన అమ్మాయితో ఈ వివాహం ఖాయమైనట్లుగా తెలుస్తోంది.  2023 ఆగస్టు 19న నర్సాపురంలో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారని, సెప్టెంబర్6 న  పెళ్లి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త వంగవీటి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. 

వంగవీటి మోహనరంగ కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చారు వంగవీటి రాధ.  కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆయన..    2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.  2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ..  2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు.  ప్రస్తుతం రాధ టీడీపీలో ఉన్నారు.