కాపు నాయకుడు వంగవీటి రాధ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ( సెప్టెంబర్ 26, 2024 ) తెల్లవారుజామున గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు వంగవీటి రాధ. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పటంతో కుటుంబసభ్యులు రాధను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు రాధకు మైల్డ్ స్ట్రోక్ వచ్చినట్లు నిర్దారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
వంగవీటి రాధకు గుండెపోటు వచ్చిందన్న వార్తలతో.. ఆందోళన చెందిన అభిమానులు.. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆయన ప్రాణానికి ఎలాంటి అపాయం లేదని డాక్టర్లు తెలపటంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాధను 48 గంటలు.. ఆస్పత్రిలోనే.. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది.