ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంతారా

ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంతారా

గుజరాత్‎లోని రిలయన్స్ జామ్​నగర్ రిఫైనరీ కాంప్లెక్స్​ గ్రీన్​బెల్ట్‎లోని 3000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 200 జాతులు, 1.5 లక్షలకుపైగా వన్యప్రాణులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వంతారా(స్టార్ ఆఫ్​ ది ఫారెస్ట్) వన్యప్రాణుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనిని రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్​ ఏర్పాటు చేశాయి. 

వంతారా ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ అడవి. 

అంతరించిపోతున్న జంతువులను సంరక్షించడం, గాయపడిన, ప్రమాదంలో చిక్కుకున్న వన్యప్రాణులను కాపాడి, చికిత్స చేసి, సంరక్షించి, పునరావాసం కల్పించడం. 

వన్యప్రాణుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హాస్పిటల్​లో వైల్డ్​లైఫ్​ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్​ మెడిసిన్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ తదితర జంతు వైద్య వసతులను కల్పించడం.
    
 ఇందులో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా హాస్పిటల్​ ఉన్నది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో వంతారాను నిర్వహిస్తున్నారు.