రిజర్వాయర్​ల నుంచి నీరు విడుదల చేయాలి : వంటేరు ప్రతాప్​రెడ్డ

రిజర్వాయర్​ల నుంచి నీరు విడుదల చేయాలి : వంటేరు ప్రతాప్​రెడ్డ

గజ్వేల్, వెలుగు: మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్​రిజర్వాయర్​ల నుంచి నీటిని విడుదల చేయాలని గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్​చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్​చేశారు. సోమవారం ఆయన గజ్వేల్​క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకుంటే ఆగష్టు 2న మాజీ మంత్రి హరీశ్ రావు సారథ్యంలో రైతులతో కలిసి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. 

వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. మల్లన్న, కొండపోచమ్మ సాగర్​లలో నీరు ఉన్నా ప్రభుత్వం విడుదల చేయకుండా రైతలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో జీపీపీ చైర్మన్​రాజమౌళిగుప్తా, నాయకులు శ్రీనివాస్, మల్లేశం, పలువురు బీఆర్ఎస్​నాయకులు పాల్గొన్నారు.