
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి, ఆమె నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. పలు సినిమాల్లో కీలక పాత్రలతో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె సోలోగా చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ శబరి. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ సిఎంమాను అనిల్ కాట్జ్ తెరకెక్కించాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు (మే 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? సోలో హీరోయిన్ గా వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ హిట్టు కొట్టిందా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుంద్దాం.
కథ:
సంజన(వరలక్ష్మి శరత్ కుమార్).. భర్త అరవింద్(గణేష్ వెంకట్ రామన్)ని వదిలేసి కూతురు(బేబీ నివేక్ష)తో సింగిల్ గా ఉంటుంది. ముంబై నుంచి వైజాగ్ వచ్చి ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే తన కాలేజీ ఫ్రెండ్ లాయర్ రాహుల్(శశాంక్)ని కాలుస్తాడు. అతని సహాయంతో జుంబా డాన్స్ ట్రైనర్ గా జాయిన్ అవుతుంది. మరోపక్క.. సంజనకు తనని, తన కూతురుని ఓ క్రిమినల్ చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అదే విషయాన్నీ పోలీసులకు చెప్పగా.. వాళ్ళు విచారణ చేస్తే ఆ క్రిమినల్ అప్పటికే చనిపోయాడని తెలుస్తుంది. మరోవైపు సంజన భర్త కూతురిని తనకు ఇవ్వాలని కోర్టుకు వెళ్తాడు. అసలు సంజన అరవింద్ ని ఎందుకు వదిలేసింది? సంజనని చంపడానికి వెంబడిస్తున్న ఆ క్రిమినల్ ఎవరు? కూతురు కోసం సంజన ఏం చేసింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
సినిమా ఓ మానసిక రోగుల ఆశ్రమంలో మొదలవుతుంది. అందులోని ఓ వ్యక్తి ఇద్దరిని చంపి తల్లి కూతురు కోసం వెతుకుతున్నట్టు చూపించి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో కథని మొదలుపెట్టిన తీరు బాగున్నా.. పాత్రల పరిచయానికి ఎక్కువ టైం తీసుకున్నారు. దానివల్ల సాగతీతగా అనిపిస్తుంది. సూర్య పాత్ర ఎంట్రీ తరువాత మళ్ళీ కథలో వేగం పుంజుకుంటుంది. ఆ తరువాత వచ్చే హారర్ ఎలిమెంట్ సీన్స్ కావాలని పెట్టినట్టుగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్.. మహేష్ బాబు నేనొక్కడినే సినిమాను గుర్తు చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లు బాగున్నాయి. ఇక శబరి సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ ఉన్నా.. వాటిని తెరకెక్కించడంలో డైరెక్టర్ తడబడ్డట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లేపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
నటీనటులు:
వరలక్ష్మి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేది. తల్లిగా ఎమోషన్, యాక్షన్ సీన్స్ లో తన మార్క్ చూపించారు. సింగిల్ మదర్ గా కూతురు కోసం తపన పడే మహిళగా అద్భుతమైన నటనను కనబరిచారు. మైమ్ గోపి భయపెట్టగలిగాడు. రెండు షేడ్స్ లో గణేష్ వెంకట్రామన్ కనిపించి మెప్పించాడు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నివేక్ష క్యూట్ గా చేసింది. లాయర్ గా శశాంక్, పోలీసాఫీసర్ గా మధుసూదన్, కామెడీతో భద్రం.. పాత్ర మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతికనిపుణులు:
సినిమాకు మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ. సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి. గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సస్పెన్స్ థ్రిల్లర్ కి తగ్గట్టు బాగుంది. పాటలు కూడా సో సో గానే ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. ఇక శబరీ కథ కొత్తగా ఉన్నా.. ట్రీట్మెంట్ లో తేడా కొట్టేసింది. దర్శకుడిగా అనిల్ పర్వాలేదనిపించారు.
మొత్తంగా శబరి సినిమా కూతురి కోసం తల్లి చేసే పోరాటాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ గా చూపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే ఆ సస్పెన్స్ ఫీల్ అవ్వొచ్చు.