‘శబరి’ చిత్రంతో వస్తున్న వరలక్ష్మీ శరత్‌‌‌‌‌‌‌‌కుమార్

‘శబరి’ చిత్రంతో వస్తున్న వరలక్ష్మీ శరత్‌‌‌‌‌‌‌‌కుమార్

డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వరుస సక్సెస్‌‌‌‌‌‌‌‌లు అందుకుంటున్న వరలక్ష్మీ శరత్‌‌‌‌‌‌‌‌కుమార్.. ‘శబరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది.  అనిల్ కాట్జ్ దర్శకత్వంలో  మహేంద్రనాథ్ కొండ్ల నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. గురువారం నుంచి వరలక్ష్మి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘శబరి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా షూటింగ్ పూర్తయింది. . ఇప్పుడు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశా. నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో మహేంద్ర  ఒకరు. చాలా లొకేషన్లలో షూటింగ్ చేశాం. సినిమా బాగా వచ్చింది’ అని చెప్పింది.  ఇందులోని యాక్షన్ సీన్స్ హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తాయని, త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ని అనౌన్స్ చేస్తామన్నారు నిర్మాత. ఇక తెలుగులో బాలకృష్ణ చిత్రంతో పాటు ‘హనుమాన్‌‌‌‌‌‌‌‌’లో నటిస్తోన్న వరలక్ష్మి.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఫుల్ బిజీగా ఉంది.