గచ్చిబౌలి, వెలుగు: ప్రేమ, పెండ్లి పేరుతో ఓ యువతిని చీటింగ్ చేసిన కేసులో గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్స్ఓనర్పై కేసు నమోదైంది. మాదాపూర్ఏసీపీ తెలిపిన ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభాకర్‌రెడ్డి(40) గచ్చిబౌలి పరిధి ఇంద్రానగర్ లో ఉంటున్నాడు. అతను గచ్చిబౌలి డీఎల్ఎఫ్వద్ద వరలక్ష్మి టిఫిన్స్పేరుతో ఫుడ్బిజినెస్చేస్తున్నాడు.
ఏపీకి చెందిన యువతి (30) నానక్‌రాంగూడలో ఉంటుంది. ఆమెతో ప్రభాకర్‌రెడ్డికి పరిచయం ఏర్పడగా, ఇద్దరూ కొంతకాలం కలిసి ఉన్నారు. ప్రేమ, పెండ్లి పేరుతో తనను నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడని గత జనవరిలో యువతి గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ చేసింది. ప్రభాకర్‌రెడ్డిపై అట్రాసిటితో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు ప్రభాకర్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌కేసులో ప్రభాకర్‌రెడ్డిని గతేడాది సెప్టెంబర్12న రాజేంద్రనగర్ఎస్ఓటీ, మోకిల పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుంచి డ్రగ్స్తెచ్చి తన టిఫిన్ సెంటర్అడ్డాగా అమ్ముతుండగా.. అతడితో పాటు ఓ యువతిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం యువతిపై లైంగికదాడి కేసులో మరోసారి ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్అయ్యాడు.