
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించనున్నారు. వరలక్ష్మీ వ్రతంలో నేరుగా పాల్గొనే భక్తుల కోసం ఆగస్టు 18న ఆన్ లైన్ లో ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. వెయ్యి రూపాయిలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని ఆస్థాన మండపంలో శుక్రవారం (ఆగస్టు 25)న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు.అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ వ్రతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు ఆగస్టు 26వ తేదీ నుండి 90 రోజులలోపు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా అభిషేకం, వస్త్రాలంకరణ సేవ, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల సేవ, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం సేవలను టీటీడీ రద్దు చేసింది.