నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. నికోలయ్ సచ్‌దేవ్‌తో ఆమె ఎంగేజ్మెంట్ మార్చి 01న ముంబైలో సైలెంట్ గా జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఎవరీ నికోలయ్ సచ్‌దేవ్ అని నెటిజన్లు సెర్చింగ్ మొదలుపెట్టారు.
నిక్లాయ్ సచ్‌దేవ్ ముంబైకు చెందిన ఒక వ్యాపరవేత్త.. ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు. . ఆన్‌లైన్ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. వరలక్ష్మి శరత్ కుమార్ కి అతనికి 14 ఏళ్లుగా పైగా పరిచయం ఉందట. కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ తమ వృత్తిగత జీవితాల్లో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉందని సమాచారం.
తమిళ నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్ కుమార్.. మొదటగా హీరోయిన్ కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తరువాత విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాటెండ్ నటిగా బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన హను-మాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న రాయన్ లోనూ ఆమె నటిస్తున్నారు. దీంతోపాటు, మలయాళంలో కలర్స్, తెలుగులో శబరి చిత్రాల్లో నటిస్తున్నారు.