హైదరాబాద్: కొంపదీసి గచ్చిబౌలి డీఎల్ఎఫ్ వరలక్ష్మి టిఫిన్స్లో తిన్నారా..?

హైదరాబాద్: కొంపదీసి గచ్చిబౌలి డీఎల్ఎఫ్ వరలక్ష్మి టిఫిన్స్లో తిన్నారా..?

హైదరాబాద్: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో హైదరాబాద్ నగరంలోని పలు రెస్టారెంట్స్, హోటల్స్ నిర్వాకం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్స్, మాదాపూర్లోని క్షత్రియ ఫుడ్స్, తుర్కయంజాల్లోని హోటల్ తులిప్ గ్రాండ్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. వరలక్ష్మి టిఫిన్స్ కిచెన్లో ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు.

ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. కుకింగ్ ఆయిల్ని రిపీటెడ్గా వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. కిచెన్లో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరు పాన్ మసాలా, గుట్కాలు నములుతూ వంటలు చేస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు.

Also Read : హైదరాబాద్​ లో భారీగా విదేశీ మద్యం పట్టివేత

హోటల్ తులిప్ గ్రాండ్లో కుళ్ళిపోయిన చికెన్ వాడుతున్నట్లు తేలింది. గడువు దాటుతున్న మష్రూమ్స్, ఐస్ క్రీమ్స్ను స్టోర్ చేసిన హోటల్ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షత్రియ ఫుడ్స్ నిర్వాహకులు నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడింది. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ స్టోర్ చేశారని, కిచెన్లో భారీగా ఈగలు ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.